Facebook

Header Ads

పెథాయి బాధితులకు బాబు ఇస్తున్న భరోసా..భేష్ . | ap govt helps to pethai cyclone victims |chendrababu naidu | pethai cyclone

    

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆర్టిజిఎస్ (రియల్ టైం గవర్నెన్స్)  ప్రాజెక్ట్. ఇప్పుడు ఇదే ప్రజల పాలిట వరంగా మారి అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతూ నిన్న వచ్చిన పెథాయి తుఫాను నష్టం నుండి కూడా కాపాడింది. ఇస్రో తో ఆర్టీజిఎస్ కి కుదిరిన ఒప్పందంతో తుఫాను తీవ్రతను ఎప్పటికపుడు ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్సులకు, కలెక్టర్స్, రైతులకు, ప్రజలకు అందించడం లో ఆర్టీజిఎస్ ముఖ్య పాత్రను పోషించింది. 

1100 కి రైతులు కాల్ చేసి మాకు కోత యంత్రాలు  మరియు టార్పాలిన్  షీట్స్ కావాలని అడిగిన వెంటనే వాటిని ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకు వచ్చి వాటినిసకాలం లో రైతులకు అందేలా చేసింది. 7 వ తేదీన అల్పపీడనం ఏర్పడవచ్చు అన్న రోజు నుండి 17 వ తేదీ యానాం,కాట్రేనికున ల మధ్య తీరం దాటుతుంది అంనేంతవరకు ఆర్టీజిఎస్ అహర్నిశలు శ్రమించింది. 




రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు సహాయక చర్యలో భాగంగా ఆది,సోమవారాల్లో  10 వేల  టార్పాలిన్  లను  అందించింది. మరియు మంగళవారం మరొక 2 వేల టార్పాలిన్ లను అందించనుంది.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1100 కాల్ సెంటర్ ఐవిఆర్ఎస్ ద్వారా తుఫాను హెచ్చరికలను వివిధ వర్గాల ప్రజలకు పంపింది.ఆర్టిజిఎస్ ఈ తుఫాను వల్లన జరిగిన నష్టాన్ని ప్రజలు నేరుగా ఫేస్బుక్ మరియు ట్విట్టర్ ద్వారా అధికారులకు తెలియచేయవచ్చు అని అందుకు గాను  13 జిల్లాలకు13 అధికారిక ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాలను తెరచింది.  

అంతే  కాకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు 20 వ తేదీ నాడు తుఫాను బాధితులకు నష్ట పరిహారాన్ని మరియు పెట్టుబడి రాయితీలను అందిస్తాం అని హామీ  ఇచ్చారు. 19 వ తేదీ సాయంత్రం నాటికే పంట మరియు ఇతర నష్ఠాల పై  అంచనాలను  పూర్తి చేస్తాం అన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ముందు గానే ఏర్పాటు చేసిన సురక్షిత పునరావాస కేంద్రాలకు బాధిత ప్రాంత ప్రజలను తరలించాలని ఆదేశించారు. ప్రజలు ఎటువంటి భయాందోళనకు  గురి కావద్దు అని తుఫాను బాధితులను అన్నివిధాలుగా ఆదుకుంటాం అని సీఎం హామీ ఇచ్చారు. 







Post a Comment

0 Comments