Facebook

Header Ads

తెలుగుదేశం పార్టీ గెలవటానికి 17 యేండ్లు పట్టింది .....ఆ నియోజకవర్గంలో!

వినుకొండ:
దేశం కంచుకోటే ....కానీ తెలుగుదేశం పార్టీ గెలవటానికి 17 యేండ్లు పట్టింది .....ఆ నియోజకవర్గంలో

తెలుగుదేశం పార్టీ పెట్టిన ఈ 37 ఏండ్లలో ఏ ఎమ్యెల్యే అక్కడ మూడోసారి గెలవలేదు ఈ సారి ఆ రికార్డ్ బ్రేక్ అవ్వబోతోందా ??


గుంటూరు జిల్లా లో పల్నాడు ప్రాంతంలో పూర్తిగా గ్రామీణ నేపథ్యం లో ఉన్న నియోజకవర్గాలలో వినుకొండ ఒక్కటి , బొల్లాపల్లి , ఈపూరు , శావల్యాపురం , వినుకొండ, నూజెండ్ల మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి ..ఒక్కప్పుడు కమ్యూనిస్టులు ప్రాబల్యము అధికంగా ఈ నియోజకవర్గంలో ఉండేది

1983 లో గుంటూరు జిల్లాలో తెలుగు దేశం పార్టీ ఓడిపోయిన ఒకే ఒక్క నియోజకవర్గం వినుకొండ , ఆ ఎన్నికలలో ఇండిపెండెంట్ గా పోటీచేసిన గంగినేని వెంకటేశ్వర్ రావు సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి పై 2200 ఓట్లతో గెలుపొందారు , ఆ ఎన్నికలలో తెలుగుదేశం తరపున పోటీ చేసిన వరదయ్య మూడో స్తానం తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది .

1985 లో తెలుగుదేశం పొత్తులో భాగంగా ఈ సీట్ సీపీఐ కి కేటాయించింది , సీపీఐ నుంచి గంగినేని వెంకటేశ్వర్రావు గారు సుమారు 12000 ఓట్లు ఆధిక్యంతో గెలుపొందారు

1989 లో ఇక్కడ నుంచి కాంగ్రెస్ తరపున నన్నపనేని రాజకుమారి గెలుపొందారు , 1989 లో పొత్తు లో భాగంగా ఈ సీట్ తెలుగుదేశం సీపీఐ కి కేటాయించింది , సీపీఐ నుంచి గంగినేని వెంకటేశ్వర్ రావు పోటీ చేసారు , కానీ సీపీఐ కి ఈ స్తానం కేటాయించటం ఇష్టం లేని స్థానిక తెలుగుదేశం క్యాడర్ మొత్తం వీరపనేని ఎలమందరావు ని ఇండిపెండెంట్ గా పోటీ చేయించారు , ఆ ఎన్నికలలో తెలుగు దేశం బలపర్చిన సీపీఐ అభ్యర్థి మూడో స్థానానికి పడిపోయారు , తెలుగుదేశం రెబల్ యలమందరావు మీద నన్నపనేని రాజకుమారి 1120 ఓట్లు తో గెలుపొందారు.

1994 లో నామినేషన్ లు చివరి తేదీ వరకు ఇక్కడ అభ్యర్థిని తెలుగు పార్టీ ఖరారు చెయ్యలేదు , యలమందరావు గారు ఇండిపెండెంట్గా బరిలోకి దిగారు , చివరి నిమషంలో యల్లమంద రావు గారి పేరు తెలుగుదేశం ఖరారు చేసింది . బిఫారం సమర్పించటంలో ఆలస్యం అవ్వటం వల్ల యల్లమంద రావు గారు నిచ్చెన గుర్తు మీద పోటీ చేసి , నన్నపనేని రాజకుమారి మీద 3106 ఓట్లతో విజయం సాధించారు

1999 లో తెలుగుదేశం పార్టీ నుంచి యలమందరావు , కాంగ్రెస్ నుంచి మక్కెన మల్లికార్జునరావు పోటీ చేసారు , ఆ ఎన్నికలలో యలమందరావు గారు మల్లికార్జున పై 800 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో బయటపడ్డారు .

1983 లో తెలుగు దేశం పార్టీ మొదటి ఎన్నికలు ఎదుర్కొంటే 1999 లో మొదటి సారి వినుకొండలో అధికారికంగా తెలుగుదేశం జెండా ఎగిరింది

2004 లో కాంగ్రెస్ నుంచి మక్కెన మల్లికార్జున రావు , తెలుగుదేశం నుంచి గోనుగుంట్ల లీలావతి పోటీచేశారు
1999 లో స్వల్ప ఆధిక్యం తో ఓడిపోయిన మక్కెన మల్లికార్జున మీద నియోజకవర్గం లో సానుభూతి వెల్లువ ఎత్తింది , ఆ ఎన్నికలలో మక్కెన మల్లికార్జున సుమారు 8000 ఓట్లు తో గెలిచారు .

2009 లో వినుకొండ నియోజకవర్గం నుంచి జివి ఆంజనేయులు గారు పోటీ చేసారు , 2009 లో జివి ఆంజనేయులు గారు కాంగ్రెస్ నుంచి పోటీచేసిన చేబ్రోలు నరేంద్రనాథ్ మీద సుమారు 25000 ఓట్లు ఆధిక్యంలో గెలిచారు , రాష్ట్రంలో 294 నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీకి అత్యధిక ఓట్లు పోలు అయినా నియోజకవర్గంగా వినుకొండ నిలిచింది ఇక్కడ తెలుగు దేశం అభ్యర్థి ఆంజనేయులు గారికి 89961 ఓట్లు పోలు అయినాయి . కుప్పంలో చంద్రబాబు గారికి 89959 పోలు అయినాయి .

2014 లో జివి ఆంజనేయులు గారు సుమారు 22000 ఓట్లు ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి నన్నపనేని సుధా మీద విజయం సాధించారు తెలుగు దేశం పార్టీకి 104321 ఓట్లు పోలు అయినాయి . రాష్ట్రంలో ఇది మూడో స్తానం గా నిలిచింది .

ప్రస్తుత పరిస్థితి

వినుకొండ నియోజకవర్గంలో ప్రస్తుతం తెలుగుదేశానికి ప్రత్యర్థి లేరు , మక్కెన మల్లికార్జున 2014 లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి 5779 ఓట్లు తెచ్చుకున్నారు , 2014 లో వైసీపీ నుంచి ఓడిపోయిన నన్నపనేని సుధని కాదు అని పెదకూరపాడు లో ఓడిపోయిన బొల్లా బ్రహ్మనాయుడు కి వైసీపీ నియోజకవర్గ భాద్యతలు అప్పచెప్పింది ,
వాస్తవానికి బొల్లా బ్రహ్మనాయుడు 2009 లో వినుకొండలో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి 11000 ఓట్లు తెచ్చుకుని ధరావత్ కోల్పోయారు .

నియోజకవర్గంలో , ఈపూరు , శావల్యాపురం , నూజెండ్ల మండలాలలో తెలుగుదేశం పార్టీకి ఏకపక్షముగా పోలింగ్ పడే గ్రామాలూ అధికంగా ఉన్నాయి , బొల్లాపల్లి మండలంలో వైకాపా కి తెలుగుదేశానికి హోరాహోరీ ఉంటుంది , ఇక వినుకొండ పట్నంలో మైనారిటీలు , వైస్యులు అధికంగా ఉన్నారు . గత ఎన్నికలలో మైనారిటీ లు వైసీపీ వైపు ఉన్నారు , ప్రస్తుతం చంద్రబాబు గారి పధకాలు ప్రభావం వల్ల వైకాపా అనుసరిస్తున్న బిజెపి అనుకూల ధోరణి వల్ల మైనార్టీలు లో తెదేపా వైపు మొగ్గు ఉంది.


ఇక్కడ నుంచి రెండు సార్లు గెలిచినా జివి ఆంజనేయులు గారు పోల్ మేనేజ్మెంట్ లో దిట్ట .

అయినా వివాదరహితుడు , నియోజకవర్గంలో స్థానికంగా ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించటం లో ముందు ఉన్నారు ,

నియోజకవర్గం లో జరిగే శుభ కార్యక్రమాలు కి హాజరు అయ్యి తన వంతుగా ఎంతో కొంత ఆర్ధిక సహాయం చేస్తూవుంటారు .
ఆర్ధిక ఇబ్బందులు కారణంగా చదువుకోలేకపోయిన విద్యార్థులు ఎందరికో అయినా ఆర్ధిక సహాయం చేస్తూవుంటారు , వీటివలన అయినా ప్రజా నాయకుడుగా ఎదిగారు
ఆంజనేయులు గారు తమ సొంత శివ శక్తి ఫౌండషన్ ద్వారా  ఉచిత కంటి పరీక్షలు నియోజకవర్గం ప్రజలకి  చేయిస్తున్నారు  .
ఇప్పటివరకు వినుకొండ నియోజకవర్గంలో లక్ష మందికి పైగా ఉచిత కంటి పరీక్షలు చేయించారు , అలాగే సుమారు 36000  కంటి శుక్లాల ఆపరేషన్లు చేయించారు . నియోజకవర్గంలో విస్తృతంగా , గ్రామా గ్రామాన  మొక్కలు నాటించి పచ్చదనం , పరిశుభ్రత ని పెంపొందించటం లో సహాయపడుతున్నారు .

అజాత శత్రువు అయినా ఆంజనేయులు గారు గెలుపు మరోసారి నల్లేరుపై నడక వంటిదే అని చెప్పటం లో అతిశయోక్తి లేదు . జనసేన ప్రభావం ఇక్కడ నామమాత్రం .
గంగినేని వెంకటేశ్వర్ రావు , వీరపనేని ఎలమందరావు రెండుసార్లు మాత్రమే గెలిచారు . జివి ఆంజనేయులు గారు మూడోసారి వినుకొండ ఎమ్యెల్గా గెలిచి మొట్టమొదటిసారిగా హ్యాట్రిక్ సాదించబోతున్నారు.

Post a Comment

0 Comments