Facebook

Header Ads

ఆంధ్రప్రదేశ్ ప్రయోజనం కోసం పేర్కొన్న అంశాలు వాటిలో అమలు చేసిన అంశాలు!

భారత పార్లమెంట్ అమోదించిన ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టం 2014  లో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనం కోసం పేర్కొన్న అంశాలు వాటిలో అమలు చేసిన అంశాలు ఒక పరిశీలన

1) సెక్షన్ 3 ప్రకారం పోలవరం ముంపు మండలాల ని ఆంధ్రప్రదేశ్ లో విలీనం చెయ్యాలి ౼100 శాతం అమలు అయ్యింది

 పోలవరం జాతీయ ప్రాజెక్టు దాని నిర్మాణ భాద్యత పూర్తిగా కేంద్రానిదే

2) సెక్షన్ 8 ప్రకారం హైదరాబాద్ లో నివసించే సీమాంధ్రుల హక్కులుకి భంగం కలగకండా చూడవలసిన భాద్యత గవర్నర్ ది

3) సెక్షన్ 9 ప్రకారం ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక గ్రహాండ్స్ శిక్షణ శిబిరం ఏర్పర్చాలి -ఎక్కడ పెట్టారో తెలిసిన వాళ్ళుకామెంట్ లో పెట్టండి

4) సెక్షన్ 26 ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నియోజకవర్గాలు సంఖ్య పెంచాలి - ఏమి జరిగిందో మీకు తెలుసు

5) సెక్షన్ 90 ప్రకారం పోలవరం జాతీయ ప్రాజెక్టు దాని నిర్మాణ భాద్యత పూర్తిగా కేంద్రానిదే  - అడుకుంటే డబ్బులు ముష్టి వేస్తున్నారు
6) సెక్షణ్ 94 (1) ప్రకారం కొత్త రాష్ట్రానికి పన్ను ప్రోత్సాహకాలు ఇవ్వాలి
7 )  సెక్షన్ 94(2) ప్రకారం రాష్ట్రంలో వెనకబడిన రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలు కి ప్రోత్సాహకాలు ఇవ్వాలి ఈ 7 జిల్లాలకు సంవత్సరానికి 50 కోట్లు చొప్పున 5 ఏండ్లుకి 1750 కోట్లు ఇవ్వాలి
ఇప్పటివరకు 1050 కోట్లు బడ్జెట్ లో కేటాయించి 900 కోట్లు ఇచ్చారు
8) సెక్షన్ 94(3)ప్రకారం రాజధాని నిర్మాణానికి పూర్తి సహకారం కేంద్రం అందించాలి - మట్టి నీరు తప్ప మనకి ఇచ్చింది ఏమి లేదు

  రాజధాని నిర్మాణాం


9) రాజధాని నిర్మాణాన్నికి అవసరం అయితే అటవీ భూముల ని డీ నోటిఫై చెయ్యాలి - పువ్వులు మీ దగ్గర ఈ ఆదేశాలు ఉంటే చూపించండి

10 ) జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం ని ఆంధ్రప్రదేశ్ లో ఏర్పర్చాలి

11) దుగ్గరాజుపట్నం ఓడరేవు మొదటి ఫేజి ని 2018 కి పూర్తి చెయ్యలి

దుగ్గరాజుపట్నం ఓడరేవు

12) కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రం స్థాపించాలి

13) గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ ని , పెట్రోకెమికల్ కాంప్లెక్ ఏర్పర్చాలి
14 ) విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్ ని ఏర్పాటై చెయ్యాలి
15 ) విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి లో అంతర్జాతీయ విమానాశ్రయం లు ఏర్పర్చాలి

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం


16) ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానికి రోడ్డు రైలు సౌకర్యాలు కల్పించడానికి కేంద్రం పూర్తి సహాయం చెయ్యాలి
17) విశాఖపట్నం, విజయవాడలో మెట్రో రైలు నిర్మాణాలు చెప్పటాలి..
18) కేంద్ర విద్యా సంస్థలు ఏర్పాటు చెయ్యాలి వీటికి మొత్తం 7500 కోట్లు అవుతుంది కానీ అరకొర కేటాయింపులు చేస్తున్నారు.

ఈ అంశాలు లో ఎన్ని అమలు అయినయో మీరే ఆలోచించండి ..
ఇవి కాక
1. ఆర్ధిక లోటు భర్తీ
2 రైల్వే జోన్
3 కలహండి, బుందేల్ ఖండ్ , కొరపుట్ తరహా ప్యాకేజి ఇవ్వలి
4 రాష్ట్రాన్నికి ప్రత్యేక హోదా ఇవ్వాలి .

మనం అడుగుతుంది చట్టంలో ఇస్తాము అన్నవి ఇమ్మని ..
మనకి న్యాయంగా ఇవ్వాల్సినవి ఇస్తే అంతకుమించి ఆంధ్రప్రదేశ్ కి కావాల్సింది ఏమీ ఉండదు

Post a Comment

0 Comments