Facebook

Header Ads

పోలవరం కి వెల్లువెత్తుతున్న అరుదయిన అవార్డులు | records of polavaram project | recent records for polavaram




పోలవరం ఎన్నోఏండ్ల ఆంధ్రుల కలల ప్రాజెక్ట్ ఇది. 1941 నుండి దీనిని నిర్మించాలని ఎన్నో ప్రతిపాదనలు జరిగాయి కానీ అవి అన్ని శిలా ఫలకాల దగ్గర ఆగిపోయాయి. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అయితే ఎన్నో వేళా ఎకరాలు సాగులోకి వస్తాయి అన్నది నిజం అలాగే చాలామంది తమ ఇండ్లను,పొలాలను, కోల్పయి నిరాశ్రయులు అవుతారన్నది కూడా అంతే నిజం. గత కొన్నేళ్లుగా ఈ లాభ నష్టాలను బేరీజులు వేసుకొని ప్రభుత్వాలు దీని నిర్మాణాన్ని జాప్యం చేస్తూ వచ్చాయి. 

పోలవరం ఒక బహుళ ప్రాజెక్ట్.2004  నాటి ఆంధ్ర ప్రదేశ్  సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు దీని వల్ల  కలిగే ప్రయోజనాలు అనేకం ఉన్నాయి అని,ఎన్ని కష్ఠాలు  అయినా సరే భరించి దీని నిర్మాణం పూర్తి చేయాలనీ సంకల్పిచుకున్నారు.కానీ ఈ  ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో 276 గ్రామాలు, ఛత్తీస్‌గఢ్లో 4, ఒడిశాలో 8 గ్రామాలు ముంపుకు గురవుతాయి మరియు 3427.52 ఎకరాల అటవీ భూమి మునిగిపోతుంది. అని తెలిసినప్పటికీ వెనకడుగు వేయకుండా నష్ట పోతున్న వారందరితో సమావేశాలు జరిపి ఒక నివేదికను తయారు చేపించి, ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల నష్టపోతున చిన్న,సన్న కారు రైతులకు మరియు ప్రతి ఒక్కరికి  ఆ నాటి మార్కెట్ విలువకు రెట్టింపు చెల్లించి వారికీ న్యాయం చేసారు.

ఆంధ్రప్రదేశ్‌లో 276 గ్రామాలు, ఛత్తీస్‌గఢ్లో 4, ఒడిశాలో 8 గ్రామాలు ముంపుకు గురవుతాయి. 3427.52 ఎకరాల అటవీ భూమి మునిగిపోతుంది పునరావాసానికి రూ.32,000 కోట్లు అవుతాయని అంచనా.





ఎట్టకేలకు 2010 పోలవరం నిర్మాణానికి అన్ని విభాగాల అధికారుల నుండి  అనుమతులు లభించాయి. ఆ ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలను 2018 లో నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ కి అప్పగించింది. 2014 జనవరి 1 నాటికీ ప్రాజెక్ట్ నిర్మాణాకి ఆయె ఖర్చును కేంద్ర ప్రభుత్వం ఏ పూర్తి గా బరిస్తాను అని హామీ ఇచ్చింది. 2010 లో శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ కి జాతీయ హోదా కల్పిచాలి అని కేంద్రాన్ని కోరగా వారు దాన్ని పట్టించు కోలేదు అయినా పట్టు వదలని విక్రమార్కుని లాగా అనేక రూపాల్లో కేంద్రం పై వత్తిడి తెచ్చారు. చివరకు 2014 లో కేంద్రం పోలవరం కి జాతీయ ప్రాజెక్ట్ గా గుర్తించింది ఇదే చివరి జాతీయ ప్రాజెక్ట్ అని చెప్పడం గమనార్హం. 

2014 జూన్ తర్వాత జరిగిన రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం ఆంధ్రప్రదేశ్ పై తన అక్కసును,పక్ష పథ బుద్దిని చూపించి ప్రాజెక్ట్ కి నిధులను ఇవ్వకుండా అనేక ఇబ్బందులకు గుత్తరీచేస్తూ వచ్చింది.కాని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏ మాత్రం కేంద్రం యొక్క కక్ష సాధింపులకు బ్యాపడకుండా ప్రతి సంవత్సరం పోలవరం ప్రాజెక్ట్ కి బడ్జెట్ ని కేటాయిస్తూ వచ్చింది. 2014 లో కేంద్రం పోలవరం కి జాతీయ ప్రాజెక్ట్ గా గుర్తించింది ఇదే చివరి జాతీయ ప్రాజెక్ట్ అని చెప్పడం గమనార్హం. 

కాంక్రీట్ పనులను చేపట్టిన నవయుగ సంస్థ కేవలం 16 గంటలో 8వేల క్యూబిక్ మీటర్స్ పని చేసి జాతీయ స్థాయి రికార్డు ను బద్దలు కొట్టి సరికొత్త చరిత్రకు నాంది పలికింది అంతే కాకుండా త్వరలోనే త్రిగోర్జియస్ రికార్డు ను బద్దలుకొడతాం అని తెలిపింది ఇది ఇలా ఉండగా తాజాగా పోలవరం కి 2019 అత్యుత్తమ అవార్డు అయినా  సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్(సిబిఐపి) అవార్డు  పోలవరాన్ని అలంకరించింది. 




పోలవరం ప్రాజెక్ట్ కి ఏ అవార్డు రావడం పై సీఎం చంద్రబాబు నాయుడు గారు హర్షం వ్యక్తం  చేసారు. ప్రతి తెలుగువాడు గర్వించాల్సిన సందర్భం అని అన్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం లో పాలు పంచుకున్న జలవనరుల శాఖ అధికారులు,సిబ్బందికి ముఖ్యమంత్రి అభినందనలు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో్ చెమటోడ్చిన కార్మికులను సీఎం చంద్రబాబు. అభినందించారు. 

పోలవరం ప్రాజెక్ట్ పై ప్రతి ఒక్కరు విషం చిమ్ముతున్నారు అల్లాంటి వారందరికీ ఈ అవార్డు రావడం పెద్ద సమాధానం అని అయన అన్నారు.


కేంద్రం ఒకవైపు మనల్ని తప్పుపడుతోంది.అడుగడుగునా అడ్డంకులు పెడుతోంది.కేంద్రంలో బిజెపి నేతలు  బురద జల్లుతున్నారు.వాటికి ఇక్కడి ప్రతిపక్షాలు వంత పాడుతున్నాయి. కేంద్రం విఘ్నాలను అధిగమించడం,ప్రతిపక్షం అడ్డంకులను ఎధుర్కోవడం,వీటన్నింటినీ తట్టుకుని పురోగతి సాధించడం నిజంగా కత్తిమీద సామే. 

ఈ బృహత్తర యజ్ఞంలో పాలుపంచుకున్న అందరికీ ధన్యవాదాలు. ఎన్ని విమర్శలు ఎదురు వచ్చిన,ఎవరు ఏ మన్న పోలవరం ని అనుకున్న సమయానికి పూర్తి చేసి తీరుతాం అని అన్నారు.  సోమవారాన్ని పోలవారంగా మార్చడం,మనం చేసిన ఫీల్డ్ విజిట్స్, మనం చేసిన వర్ట్యువల్ విజిట్స్, మన అధికారులు,సిబ్బంది,కార్మికుల శ్రమకు ఇది గుర్తింపు. దేశానికే ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పోలవరం. పోలవరం నిర్మాణంలో భాగస్వాములైన అందరికీ అభినందనలు. నిర్మాణానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా,మొక్కవోని దీక్షతో పనిచేస్తున్నాం. 

మనపై విమర్శలకు మన పనితీరుతోనే సమాధానం.అవార్డులే మన పనితీరుకు కొలమానం.


వృద్ధిరేటులో, ప్రాజెక్టుల నిర్మాణంలో,పెట్టుబడుల ఆకర్షణలో,విద్యుత్ రంగంలో,ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లో,పేదల సంక్షేమంలో్ అన్నింటిలో ఏపి దేశంలోనే అగ్రగామిగా ఉంది.ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి అని సీఎం చంద్ర బాబు తెలిపారు. 

Post a Comment

0 Comments