Facebook

Header Ads

పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో మరొక చారిత్రక ఘట్టం | polavaram updates





ఎన్నో దశాబ్దాల కల పోలవరం ప్రాజెక్ట్.ఈ  ప్రాజెక్ట్ నిర్మాణం గురించి ఎన్నో చర్చలు, సమావేశాలు, శిలాఫలకాలు,ఎన్నో  ప్రభుత్వాలు మారాయి  కానీ జరిగిన పని మాత్రం అంతంత మాత్రం. ఎన్నో అభ్యంతరాలను ,అవరోధాలను అధిగమించి చివరకు జాతీయ హోదాను పొందింది.

విభజనానంతరం  నవ్యాఆంధ్రప్రదేశ్   సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు  ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ ని  వ్యయప్రయాసలు  పడి కేంద్రం తో పోరాడి, ప్రక్క రాష్ట్రము సూటి పోటీ  మాటలు , ప్రతిపక్షాలు వంగ్యాస్త్రాలు సంధించిన అదరక  బెదరక  అకుంఠిత దీక్ష పట్టుదలతో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని తలకెత్తుకున్నారు. ఎన్నో  క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్న  ప్రాజెక్ట్ అంచెలంచెలుగా అభివృద్ధి చెంది నేటికి చరిత్రలో నిలిచే ఘట్టానికి వేదిక అయింది. 

సకాలంలో నిధులు ఇవ్వలేదు అంటుంది రాష్ట్రం. ఇచ్చిన వాటికి లెక్కలు అడుగుతోంది కేంద్రం. కేంద్రం కోరుకున్న పద్దతిలో  పనులు సాగాలంటోంది. 


 అసలు పోలవరం ఆంధ్రుల జీవనాడి ఎందుకు అయింది ? 

పోలవరం ఎడమ, కుడి, కాలువలు , రిజర్వాయర్ పోలవరం పథకము  గోదావరి,కృష్ణ నదులను అనుసంధానిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం సమీపంలో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల ఉభయ గోదావరి, కృష్ణ లోని మెట్ట ప్రాంతాలకు సాగు తాగు నీటి అవసరాలను తీరుస్తుంది అంతేకాకుండా విశాఖ మహానగర తాగు  నీటి అవసరాలను అక్కడి పరిశ్రమల పారిశ్రామిక అవసరాలను తీరుస్తుంది అని అంచెన. అందువలన పోలవరం ఆంధ్రుల జీవనాడి
అయినది. 

పోలవరం వల్లన ఉపయోగాలు :

ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అయితే సుమారుగా 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 15 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగు నీరు, 540 గ్రామాలకు 28. లక్షల మందికి తగు నీటి సౌకర్యం, కృష్ణ బేసిన్  లో నీటి లభ్యత తగ్గుతునందున బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా పోలవరం ఉపయోగపడుతుంది.  


ఇంతటి మహోన్నతమైన పోలవరం ప్రాజెక్ట్ తాజాగా అతి అరుదయిన చరిత్రరాత్మక ఘట్టానికి తెర తీసింది. ప్రాజెక్ట్ లో భాగంగా రిజర్వాయర్, స్పీల్ వే గేట్స్ మరియు 960 మెగావాట్  ల జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ని ఏర్పాటు చేయనున్నారు. కాగా నేడు  దేశంలోనే అతిపెద్ద స్పిల్వే గేట్లను అమర్చే ప్రక్రియ ను అప్ర భగీరధుడు,రైతు బంధు  శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు.












Post a Comment

0 Comments