Facebook

Header Ads

సమస్యల పరిష్కారమే సిఎం ఎజెండా | solving public issues is ap cm main agenda






            ప్రజాసమస్యల పరిష్కారమే సిఎం ఎజెండాగా 19వ నగర మహాసభల్లో నిర్ణయించారు. ఆది, సోమవారాల్లో కామ్రేడ్‌ కె శేఖర్‌ నగర్‌లో ఏర్పాటు చేసిన నగర మహాసభలు విజయవంతంగా ముగిశాయి. సోమవారం నాడు జరిగిన సభలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. నగర కార్యదర్శిగా పిఎస్‌ఎన్‌ మూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నగర కార్యదర్శిగా ఆయన ఏడోసారి ఎన్నికయ్యారు. 26 మందితో నూతన కమిటీని ప్రతినిధులు ఎన్నుకున్నారు.



కార్యదర్శివర్గం తొమ్మిది మందితో ఎన్నికైంది. వీరితో పాటు రాష్ట్ర మహాసభలకు హాజరయ్యే ప్రతినిధులను ఎన్నుకున్నారు. సభల్లో 12 ప్రధాన అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టారు. కేంద్రకమిటీ సభ్యులు పి మధు, రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు, కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ వీరయ్య తదితర అగ్రనేతలు పర్యవేక్షించారు.



వీరితోపాటు రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్‌ సుధాభాస్కర్‌, టి జ్యోతి, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి డిజి నరసింహారావు, మాజీ నగర కార్యదర్శి రఘుపాల్‌ తదితరులు హాజరయ్యారు. ప్రజల్లో మమేకమై ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి అగ్రనేతలు అమూల్యమైన పలుసూచనలు చేశారు. ప్రజాజీవితాన్ని అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా పోరాటాలు నిర్మించాలని వారు సూచించారు. రెండు రోజులపాటు జరిగిన సభలో ప్రతినిధులంతా ఉత్సాహంగా పాల్గొనడంతోపాటు క్రమశిక్షణ పాటించారు.



సభల్లో లక్ష్యాలను నిర్దేశిస్తూ భవిష్యత్తు కార్యాచరణ రూపొందించారు. వర్గపోరాటాలు, నివాసప్రాంత సమస్యలపై పోరాటాలు సమన్వయం చేస్తూ ముందుకు పోవాలని నిర్ణయించారు. చివరిగా '' ఆకలిమంటలు మలమలలాడే అనాధలంతా లేవండోరు'' అంటూ అంతర్జాతీయ విప్లవ గీతంతో మహాసభలు ముగిశాయి.


Post a Comment

0 Comments