Facebook

Header Ads

ఎన్నికల కోసం చేసే జిమ్మికులకు రాజ్యాంగ భద్రత.... న్యాసమిక్ష వర్తిస్తాయా....?

నరేంద్ర మోడీ ప్రభుత్వం అగ్రవర్ణాలలో పేదలు కి 10  శాతం రిజర్వేషన్ లు విద్య ఉద్యోగాల్లో ప్రకటించింది. ఈ నేపధ్యం లో భారత రాజ్యాంగం రిజర్వేషన్ ల గురించి ఏమి చెప్పింది ?భారత దేశం లో ఏ అంశాలలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు ? ఇప్పటివరకు రిజర్వేషన్ల కోసం ఎన్ని రాజ్యాంగ సవరణలు జరిగాయి?భారత రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్స్ అనేవి 50 శాతం మించకూడదు. విపులంగా చర్చిద్దాం.


ఈబీసీ  వారికీ 10% రిజర్వేషన్ ప్రకటిస్తున్న మోడీ


1950 లో అమలు లోనికి వచ్చిన రాజ్యాంగం లో కేవలం చట్ట సభలు లో మాత్రమే రాజకీయ రిజర్వేషను లు ఇవ్వటం జరిగింది. భారత రాజ్యాంగం విద్య ( ఆర్టికల్ 15 ) ఉద్యోగాలు ( ఆర్టికల్ 16 ) చట్ట సభలు( ఆర్టికల్ 330 ,331 ,332 ,333 ,334 ,335 ) స్థానిక సంస్థలు లో ( ఆర్టికల్  243 D , ఆర్టికల్ 243 T ) రిజర్వేషన్లు కల్పించింది. తరవాత కాలం లో రిజర్వేషన్లు పరిణామ క్రమం ఇది భారత రాజ్యాంగం ఈ దేశ పౌరులు అందరూ కి సమానత్వ హక్కు కల్పించింది..
సమానత్వపు హక్కు అనేది ప్రాధమిక హక్కు ఏదైనా ఒక వర్గానికి రిజర్వేషన్ కల్పించాలి అంటే ప్రాధమిక హక్కులు ని సవరించాలి
  
ప్రాథమిక హక్కు సవరించాలి అంటే రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపము దెబ్బతినకాండ సవరించాలి ఆర్టికల్ 15 ప్రకారంరాజ్యం ఏ పౌరుడు పట్ల జాతి, మతం, కులం, లింగం, జన్మ స్థలం ఆధారంగా వివక్ష చూపించరాదు.
ఆర్టికల్ 16(3) మెటర్నేటి  లీవ్, అంగన్ వాడి, ఎయిర్ హోస్టెస్, నర్స్, డాక్టర్లు వంటి ఉద్యోగాలు లో స్త్రీలు కి కఠిన పరిశ్రమలు, మిలటరీ, ఉక్కు కర్మాగారలు లో పురుషుల కి ప్రత్యేక సదుపాయాలు కల్పించటం అనేది సమానత్వం హక్కు కి వ్యతిరేకం కాదు. ఈ రిజర్వేషన్స్ ప్రక్రియ తరతరాలుగా ఉన్నది.ఎన్నో రాష్ట్రాల్లో రాజ్యాంగ విరుద్ధం గా రిజర్వేషన్ కల్పించడం లో ముందుకు సాగిపోగా చివరకు న్యాయ పరీక్షలో వీగిపోతున్నాయి. ఎందుకంటే ఒకసారి 50శాతం రిజర్వేషన్ పూర్తి అయిన తరువాత వేరే ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించరాదు అని రాజ్యాంగం చెప్తుంది. 


ఆర్టికల్ 16 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలు లో అందరూ కి సమాన అవకాశాలు కల్పించాలి


 50 శాతం రిజర్వేషన్ దాటి రిజర్వేషన్ కల్పించి న్యాయ సమీక్షలో వీగిపోయినవాటికి ఒక ఉదాహరణ చంపకం దొరై రాజన్ కేసు. మద్రాస్ ప్రభుత్వం వైద్య ఇంజినీరింగ్ కాలేజీలు లో కొన్ని కులలు కి రిజేర్వేషన్ ప్రకటించటం సవాల్ చేస్తూ చంపకం దొరై రాజన్ అనే విద్యార్థి సుప్రీంకోర్టు లో కేసు వేశారు సుప్రీంకోర్టు మద్రాస్ ప్రభుత్వం ప్రకటించిన రిజేర్వేషన్ రాజ్యాంగ విరుద్ధం అని తీర్పు ఇచ్చింది.దానితో మొట్టమొదటి రాజ్యంగా సవరణ అవసరం అయ్యింది దాని ప్రకారం ఆర్టికల్ 15 (4) రాజ్యంగం లో చేర్చారు. రాజ్యం పౌరుల పట్ల రక్షిత వివక్ష పాటించటం అనేది ప్రాధమిక హక్కు ఆయిన సమానత్వపు హక్కు కి భంగం కలిగినట్టు  గా భావించరాదు. ఆర్టికల్ 16 (4)  షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనక బడిన కులాలు కి ప్రభుత్వ ఉద్యోగాలు లో సరి అయిన ప్రాతినిధ్యం లేదు అని రాజ్యంగం భావిస్తే వారికి రిజేర్వేషన్ కల్పించవచ్చు. ఎం ఆర్ బాలాజీ కేసు 1963 లో సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ రిజేర్వేషన్ 50 శాతం మించరాదు అని పేర్కొన్నారు 1994 లో తమిళనాడు లో కల్పించిన 69 శాతం రిజేర్వేషన్ లు 76 రాజ్యాంగ సవరణ ద్వారా 9 షెడ్యూల్ లో చెర్చారు.ఇంద్ర సహని కేసులో వెనక బడిన తరగతులు కి కల్పించిన రిజేర్వేషన్ లు 50 శాతం పరిమితి కి లోబడి చెల్లుతాయి అని ప్రమోషన్ లో రిజేర్వేషన్ లు చెల్లవు అని పేర్కొన్నారు.దీనికోసం 77, 85 రాజ్యాంగ సవరణలు చేసిఆర్టికల్ 16 (4A) ని 81 రాజ్యాంగ సవరణ చేసి 16 (4బి) ని చేర్చారు16 4ఏ ప్రకారం పదోన్నతులు లో రిజేర్వేషన్ లు కల్పిస్తున్నారు16 4బి ప్రకారం క్యారి ఫార్వర్డ్ ఆమలు చేస్తున్నారు.ఇమందార్  కేసులో ప్రైవేట్ విద్య సంస్థలలో  ఓ బి సి లు కి రిజర్వేషన్లు చెల్లవు అని సుప్రీమ్ కోర్టు తీర్పు చెపింది.15 (5) 93 రాజ్యాంగ సవరణ చేసి కల్పిస్తున్నారు.నరసింహ రావు మరియు ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం కేసులో ముల్కి నిబంధనలు చెల్లవు అని తీర్పు ఇచ్చారు.


ఇమందార్  కేసులో ప్రైవేట్ విద్య సంస్థలలో  ఓ బి సి లు కి రిజర్వేషన్లు చెల్లవు అని సుప్రీమ్ కోర్టు తీర్పు చెపింది

నరసింహ రావు మరియు ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం కేసులో ముల్కి నిబంధనలు చెల్లవు అని తీర్పు ఇచ్చారు.దీని కోసం  32 రాజ్యాంగ సవరణ చేసి ఆర్టికల్ 371 D ర్చారు..ఉద్యోగాల్లో స్థానికులకు ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ లో రిజర్వేషన్లు కల్పిస్తున్నారు సుప్రీమ్ కోర్టు రెండు కీలక కేసులలో రిజెర్వేసన్లు 50  శాతం దాటరాదు అని చెప్పింది 
1 ఏ ఆర్ బాలాజీ కేసు 1963 
2  ఇంద్ర సహానీ కేసు 1994 
రాజ్యాంగం ప్రజలు కి సమానత్వపు హక్కు కల్పించింది ,
 50 శాతం దాటినా రిజర్వేషన్లు అనేది సమానత్వపు హక్కు కి భంగం కలిగినట్టే ,అదే సమయం లో రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూప సిద్దాంతం కి ఇది భంగం వాటిల్లినట్టే అగ్ర వర్ణ పేదలు కి మోడీ ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లు అనేది కేవలం ఒక రాజకీయ జిమ్మికు మాత్రమే న్యాయ సమీక్షకి ఈ నిర్ణయం నిలబడదు .



కొన్ని రాష్ట్రాలలో 50 శాతం మించి రిజెర్వేషన్లు అమలు లో ఉన్నాయి అంటే దానికి కారణం వాటిని ఎవరు కోర్టులలో సవాలు చెయ్యకపోవటమే ప్రాధమిక హక్కులు కి సవరణ చెయ్యాలి అంటే లోక్ సభ లో , రాజ్య సభ లో 2 / 3 వంతు మెజారిటీ ఉండాలి ఒక వేళ్ళ పార్లమెంట్ సవరించిన,రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం కి వ్యతేకంగా ఉంటుంది కాబట్టి ఈ రాజ్యాంగ సవరణ న్యాయ సమీక్షకి నిలబడకపోవచ్చు.





అగ్ర వర్ణ పేదలు కి మోడీ ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లు అనేది కేవలం ఒక రాజకీయ జిమ్మికు మాత్రమే 

Post a Comment

0 Comments