Facebook

Header Ads

చంద్రబాబు గారి పవర్ ముందు.. పవర్ ప్లాంట్ కూడా దిగ దుడుపే..

65 ఏళ్ళు వచ్చేసాయి పదవి విరమణలు చేసాం. ఇక హ్యాపీ గా మనుమలు మనవరాళ్లతో కాలం వెళ్లదీస్తూ ఉంటారు చాలామంది. ఇంట్లో ఉన్న కొడుకులు లేదా కోడలు లేదా కూతుళ్లతో సేవలు చేయించుకుంటూ ఉంటారు. ఆ వయసుకే అయ్యో రామ అంటుంటే,68ఏళ్ల వయస్సులో కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం నవ యువకుడిలా పరుగులు పెడుతున్నారు.

2013 పాదయాత్ర లో అభివాదం చేస్తున్న చంద్రబాబు 


68 ఏళ్ల వయస్సులో హాలులో పడక కుర్చీలో కూర్చుని అన్ని చేతికి అందించుకోవటం చూశాం.68 ఏళ్ల వయస్సులో బస్సు ఎక్కి మేం సీనియర్‌ సిటిజన్లు లేచి సీటివ్వండి అనటం చూశాం.
మేం సీనియర్‌ సిటిజన్స్‌ రైలులో మాకు కింద బెర్త్‌ ఇవ్వండి అనే వాళ్లని చూశాం.

చేతికర్ర పట్టుకుని పార్కులో చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం వింటూ నడిచేవాళ్లని చూశాం.68ఏళ్ల వయస్సుల నెలకోమారు వైద్య పరీక్షలు అనుమానంతో చేయించుకునే వాళ్లను చూశాం.మనుమలు, మనుమరాళ్లతో ఆడుకుంటూ పాడుకుంటూ పడుకునేముందు కాసిని బీపీ బిళ్లలు వేసుకుని లేవగానే భక్తి టీవీలో ప్రవచనం పెట్టుకునే వాళ్లని చూశాం.దూరంలో ఉండే పెళ్లిళ్లు, శుభాకార్యాలకు వెళ్లలేక….ఎవరన్నా రాలేదమని అడిగితే 70 ఏళ్లు వచ్చేసాయి కదా ఈ వయసులో ప్రయాణాలు ఏం చేస్తాం అనే వాళ్లని మాత్రమే చూస్తున్నాం.

కానీ చంద్రబాబు ఏంటి మనిషిలా కాక యంత్రంలా ఉన్నాడు?

అసలాయన వయస్సు 68ఏళ్లేనా అనే అనుమానం కలుగుతోంది. దేశంలో ఆయన వయస్సున్న వాళ్లు ఎవరైనా 18 గంటలు పని చేయగలుగుతున్నారా? అన్ని ప్రయాణాలు చెయ్యగలుగుతున్నారా?  అలుపూ సొలుపూ లేకుండా ఆ వయసులో ఎలా సాధ్యం? యువతి అయిన జగనన్న విడిచిన బాణం కూడా కాలు బెణికిందని విడతల వారి గా పాదయాత్ర  చేసిందే కాని చంద్రబాబులా ఒకేసారి పాదయాత్ర చెయ్యలేదు.


మనవడు దేవాన్ష్ తో చంద్రబాబు నాయుడు 

ఏదో అనుమానంగా వుంది.చంద్రబాబు పుట్టిన తేది మీద సీబీఐ దర్యాప్తు చెయ్యాలి.ముచ్చటేసే మనవడితో ఆడుకోకుండా మనసెలా చంపుకొని మనకోసం పనిచేస్తున్నాడు?
రాష్ట్రం కోసం కుటుంబం మీద వైరాగ్యమా?చరిత్రలో నిలిచిపోయే పనులు చేసే అదృష్టం వచ్చిందనే ఆనందం నిలవనీయడం లేదా?నిదురలేకుండా పని చేయిస్తోందా?


తెలుసుకోవలసిందే..ఆ పవర్ ఏంటో మనక్కూడా కావలసిందే.నిత్య నవ యువకుడిలా పనిచేస్తున్న ఆయన శక్తి రహస్యాన్ని ఛేదించాల్సిందే…

Post a Comment

0 Comments