Facebook

Header Ads

ఆంధ్ర ప్రదేశ్ లో కంపెనీ ల వరద......రాష్ట్రము బాగు చూసి ప్రతిపక్షాల గుండెల్లో బాధ......


2014 వ సంవత్సరం లో తెలుగు ప్రజలను రెండు గా చీలుస్తూ నాటి  కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటికి  మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము. అద్భుతమైన రాజధాని నిర్మాణమై ఉంది.ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితి అతి దారుణం గా ఉంది. లోటు బడ్జెట్, రాజధాని లేదు,ఇలాంటి విపత్క్కర పరిస్థితుల్లో 2014 ఎన్నికలో ప్రజలందరూ కలిసి శ్రీ నారా చంద్రబాబు గారు మాత్రమే తమని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదం లో నడి పించగలరు అని నమ్మి గెలిపించారు.

ప్రజల కోసం పుట్టింది తెలుగు దేశం పార్టీ.సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు. అన్నది నినాదం. నాటి నుండి నేటి వరకు ప్రజల సమస్యలు తీర్చడం, అభివృద్ధి పదంలో   నడిపించడం మాత్రమే ఇందులోని నాయకులకు తెలుసు. ఇవాళ ఆ దిశ గానే ఆంధ్ర రాష్ట్రము పరుగులు తీస్తూ ఎన్నో అవార్డ్స్,రివార్డ్స్ సాధిస్తోంది. 

ఉన్న  మంత్రిత్వ శాఖలో ముఖ్యంగా చెపుకోవాల్సినవి విద్య, వైద్యం,వ్యవసాయం,ఐటీ ఇంకా అనేకం.ఈ శాఖలకు ఆ రంగాలమీద అనుభవం ఉన్నవారు అయితే అభివృద్ధి ఇంకా వేగం గా సాగుతుంది అని  కేటాయించారు ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన మంత్రి ఇట్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు. విదేశాల్లో చదువుకుని,ఎన్నో పెద్ద బిజినెస్లు చేసుకోగల సత్తా మరియు తెలివి తేటలు ఉండి కూడా ప్రజలకు సేవ చేయాలి అన్న తండ్రి ఆశయాలను పోణికి పుచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చారు.


ఎటువంటి రాజకీయ లేకపోయినప్పటికీ ,తనదయిన శైలి లో ముందుకు దూసుకు వెళ్తున్నారు యువత కి ఉద్యోగ కల్పన లో, రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణలో చంద్ర బాబు గారు దూసుకు పోతూఉంటే,ఇంకో పక్క లోకేష్ గారు దేశం లో ఉన్న వ్యాపారవేత్తలను తనదయిన శైలి లో నూతన కంపెనీ ల ఆవిష్కరణకు ఉత్సాహపరుస్తున్నారు.  
కంపెనీ ల ఏర్పాటు లో ఏ ఒక్క జిల్లాని వదల కుండా అన్ని జిల్లాలకు సమ న్యాయం పాటిస్తున్నారు. కడప లో స్టీల్ ఫ్యాక్టరీ శంకుస్థాపన ,తిరుపతి లో టీసీఎల్ , ఫ్యాక్స కాన్,సెల్కన్, వైజాగ్ లో మేడి టెక్ జోన్ ఇంకా ఎన్నో.చంద్రన్న ప్రభుత్వం లో మహిళలకె  పెద్ద పీట. డ్వాక్ర, మెప్మా, పసుపు కుంకుమ ఇలా ఎన్నో పథకాలు మహిళల కోసం ఏర్పాటు చేసారు. ఈవ్ కాకుండా మహిళలకు ఆర్ధికం స్వాతంత్రం రావాలని ఆలోచించే వారిలో నారా లోకేష్ ఒక్కరు.


దానికి నిదర్శనం తిరుపతి లోని ఫ్యాక్స కాన్ కంపెనీ లో 85 శాతం మంది ఉద్యోగులు మహిళలే. 


 చిత్తూరు శ్రీ సిటీ లోని,కాన్ మొబైల్ తయారీ కంపెనీని సందర్శించిన మంత్రి నారా లోకేష్. అందులో బామ్ గ అయన ఆ కంపెనీ ఎట్లా తిరుపతి కి వచ్చింది, ఎం ప్రగతి సాధించింది అన్న  విష్యాలను చెప్పారు.2014 రాష్ట్రం ఏర్పడిన తరువాత  లోకేష్ గారు మొదటి సారి కొంత మంది పారిశ్రామికవేత్తలను కలిసి రాష్ట్రం గురించి వివరించి పెట్టుబడులు పెట్టాలి అని ఆహ్వానించాను.ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం పై నమ్మకం ఉంచి మొదట పెట్టుబడి పెట్టింది ఫాక్స్ కాన్ సంస్థ. ఇప్పటి వరకూ 7.5 కోట్ల మొబైల్ ఫోన్లు తయారు చేసిన ఫాక్స్ కాన్. 15 వేల మంది మహిళలకి ఓకే చోట ఉద్యోగాలు కల్పిచిన సంస్థ ఫేస్ కాన్. కాగా వీరిలో చాల మందికిది మొదటి ఉద్యోగం. 





ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 గా ఉండాలి అని లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాం 

ఫాక్స్ కాన్ కంపెనీ కి రావడం రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి వచ్చిన మీ అందరితో మాట్లాడటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు యుద్ధ ప్రాతిపదికన అనుమతులు కేటాయిస్తున్నాం మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం రావాలి అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది.ఇక్కడ పని చేస్తున్న వారు ఇంకా కష్ట పడి పనిచేస్తే మీకు అద్భుతమైన అవకాశాలు వస్తాయి. రాబోయే 20 ఏళ్లలో మన దేశంలోట్రిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్స్ వినియోగం ఉండబోతుంది అందులో 50 శాతం ఎలక్ట్రానిక్స్ ఆంధ్రప్రదేశ్ లో తయారు అయ్యేలా కంపెనీలు తీసుకురావాలి అని టార్గెట్ గా పెట్టుకున్నాం. 

కేవలం అసెంబ్లింగ్ మాత్రమే కాదు పూర్తి స్థాయి ఎలక్ట్రానిక్స్ తయారీ ఆంధ్రప్రదేశ్ లో జరిగేలా ఎకో సిస్టమ్ అభివృద్ధి చేస్తున్నాం. ఎలక్ట్రానిక్స్ తయారీ లో విడిభాగాల తయారీ కంపెనీలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. విడి భాగాల తయారీ కంపెనీలు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ కి రాబోతున్నాయి 
తిరుపతి సిలికాన్ సిటీ గా మారబోతుంది 

ఒక్క తిరుపతిలోనే ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో లక్ష ఉద్యోగాలు కల్పించాలి అనే లక్ష్యం పెట్టుకున్నాం


ఫాక్స్ కాన్ కంపెనీ లో 85 శాతం మంది ఉద్యోగులు మహిళలే త్వరలోనే ఫాక్స్ కాన్ కంపెనీ విస్తరణ కూడా జరగబోతుంది 30 శాతం అధికంగా ప్రొడక్షన్ పెంచబోతున్నారు 2014 కి ముందు ఒక్క మొబైల్ ఫోన్ కూడా ఆంధ్రప్రదేశ్ లో తయారు కాలేదు. కానీ ఇప్పుడు దేశంలో తయారు అవుతున్న 10 ఫోన్లలో 3 ఫోన్లు మన రాష్ట్రంలో తయారు అవుతున్నాయి. ఒక్క మొబైల్స్ మాత్రమే కాకుండా,కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ కూడా ఆంధ్రప్రదేశ్ లో జరిగేలా కంపెనీలను ఆంధ్రప్రదేశ్ కి తీసుకొస్తున్నాం 
శ్రీ సిటీ యాజమాన్యం కంపెనీలు వేగంగా ఏర్పాటు చేసేందుకు పూర్తి సహకారం అందిస్తున్నారు  ఫాక్స్ కాన్ సంస్థ ఏర్పాటు కి వంద రోజుల్లోనే ఫెసిలిటీ సిద్ధం చేసిన ఘనత శ్రీ సిటీ యాజమాన్యానికి దక్కుతుంది. 

ఇంత అభివృద్ధి జరుగుతున్న ప్రతిపక్షాలకు, కేంద్రానికి ఎం కనపడలేదు అనడం వారి విజ్ఞత కె వదిలేస్తున్న. 

Post a Comment

0 Comments