Facebook

Header Ads

చరిత్ర లో ఈరోజు .. ప్రపంచ రికార్డుల ను తిరగ రాయబోతున పోలవరం... గిన్నిస్ బుక్ అఫ్ రికార్డ్స్ లో స్థానం.


దశాబ్దాల కాలం గా ఉన్న ఎదురు చూపులు ఫలించాయి. కేంద్రం చేసిన ఎన్నో ఎదురు దెబ్బలు, దాడులు జరిగి నప్పటికీ మన నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారి అకుంఠిత దీక్ష, పట్టుదలతో నాడు పోలవరం కి జాతీయ హోదాను సాధించారు.పోలవరం నిర్మాణ బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి నేటి వరకు అలుపెరగని కృషి, పట్టుదలతో తో పోలవరం ప్రాజెక్ట్ ని అంచెలంచెలు గా అభివృద్ధి చేస్తూ ఎన్నో అవార్డ్స్,రివార్డ్స్ సాధించే స్థాయికి తీసుకు వచ్చారు.నిర్మాణ బాధ్యతలను సక్రమంగా ర్వహించగాల సంస్థలను ఎన్నుకొంటూ ఎప్పటికపుడు వీడియోకాన్ఫరెన్స్ లను నిర్వహిస్తూ, సమీక్షలు జరుపుతూన్నారు.

మాయ మాటలు చెప్పే, గారడీలు చేసే మోడీ గారు ఈ  మధ్య ఒక వీడియో కాన్ఫరెన్స్ లో ఈ  క్రింది  విధంగా  చెప్పారు 

పోలవరం నిర్మాణాన్ని తామే నిర్వహిస్తామంటే మేము కాదనలేదని, ఇప్పటివరకు రూ. 7 వేల కోట్లు ఇచ్చినా పోలవరం నిర్మాణాన్ని సరిగా ఎందుకు నిర్వహించలేకపోతోందని ఈ మధ్య ప్రధాని మోది ఒక వీడియో కాన్ఫెరెన్స్ లో ప్రశ్నించారు. 

నిజా నిజాలను పరిశీలిస్తే ఏ క్రింది విధంగా ఉన్నాయి.

పోలవరం నిర్మాణ ఖర్చు రూ.57,940.86 కోట్లు కాగా గత డిసెంబర్ 15 వరకు ఈ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం రూ.10,069.66 కోట్లను ఖర్చు చేసింది. ఇందులో రూ.6,727.26 కోట్లను ఇచ్చిన కేంద్రం ఇప్పటివరకూ చేసిన ఖర్చులోనే  ఇంకా రూ.3,342.40 కోట్లు ఇవ్వాలి. గత నాలుగు నెలలుగా ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా పోలవరం నిర్మాణాన్ని తొక్కి పెడుతూ మోదీ మాట్లాడిన   మాటలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతలతోనే సమాధానం చెప్తోంది.   

 ఇప్పటికే దాదాపు 63 శాతం ప్రాజెక్టు పనులను పూర్తిచేసిన ప్రభుత్వం... పోలవరం ప్రాజెక్టు కాంక్రీట్‌ పనుల్లో ప్రపంచ రికార్డు నమోదుకు సిద్ధమైంది. స్పిల్‌ఛానల్‌లో 24 గంటల్లో రికార్డుస్థాయిలో 28 వేల ఘనపు మీటర్ల కాంక్రీట్‌ వేయనున్నారు. డిసెంబర్ 6వ తేదీ ఉదయం 9 నుంచి 7వ తేదీ ఉదయం 9 గంటల వరకు ఈ పని జరగనుంది. పనులను పరిశీలించడానికి జాతీయ, అంతర్జాతీయ మీడియాను పోలవరం తీసుకొస్తున్నారు. ఈ రికార్డును గిన్నిస్‌ బుక్‌లో నమోదు చేయనున్నారు. 

సోమవారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారు. రికార్డు స్థాయిలో కాంక్రీట్ పనులు చేసినందుకు గుర్తుగా నిర్మించిన పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. తర్వాత 13 జిల్లాల జలవనరుల శాఖ అధికారులు, సిబ్బంది, పది వేల మంది రైతులు పాల్గొనే బహిరంగ సభలో సీఎం మాట్లాడతారు. 


7,250 ఘ.మీ. కాంక్రీటు వేసి తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు దేశ రికార్డును సృష్టిస్తే ఈ మధ్యనే పోలవరం నిర్మాణంలో 24 గంటల్లో 11,153 ఘ.మీ.ల కాంక్రీటు వేసి దేశ రికార్డును అధిగమించింది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ప్రపంచ రికార్డు  (చైనాలోని త్రీగార్జెస్‌ -13,000 ఘ.మీ.)ను అధిగమించే లక్ష్యంతో 24 గంటల్లో  28 వేల ఘనపు మీటర్ల కాంక్రీట్‌ వేయనున్నార. 
           
చుడండి మోడీ గారు మీరు ఎన్ని అడ్డాకుల పెట్టిన, ఎంత ఎదురు దాడులు చేయించిన 




అరచేతితో సూర్యుడి వెలుగుని, అభివృద్ధిలో  మా చంద్ర అన్న వేగాన్ని ఆపడం ఎవరితరం కాదు. కక్షలు కార్పణ్యాలు, బాంబులు,బాకులు ఉన్న  రాయలసీమ గడ్దని,ఫ్యాక్టరీ ల అడ్డా గా మార్చిన ఘనత మా చంద్ర అన్నది. ఇది నారా సర్కార్. హమారా సర్కార్ . 

Post a Comment

0 Comments