Facebook

Header Ads

కేంద్రం మోసాల పై ఒక కన్ను వేద్దామా... | central govt cheating ap




నాడు తమిళనాడు నుండి తమకు ప్రేత్యేక ఆంధ్ర రాష్ట్రము కావాలని ఆంధ్రులు పోరాటాలు మొదలు పెట్టారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీ రాములు గారి ఆమరణ నిరాహార దీక్షా మరియు వారి ప్రాణ త్యాగాలతో, ఎందరో పోరాట యోధుల ప్రతిఫలం మన ఆంధ్ర రాష్ట్రము. హైదరాబాద్ రాష్ట్రము లోని తెలుగు మాట్లాడే వారు ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని కలిపి సువిశాలమైన ఆంధ్ర ప్రదేశ్ ఏర్పరిచారు. నవంబర్ 1, 1956 వ తేదీ నాడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం గా మనం జరుపుకుంటున్నాము. 

 

విభిన్న కళలు, సంస్కృతులు, సాంప్రదాయాలు, యాసలు, బాషలు ఉన్నపటికీ ప్రజలందరు అన్నదమ్ముల అక్క చెలెళ్లలా కలిసి మెలసి ఉండేవారు. రాష్ట్రము కోసం ఎందరో మహానుభావులు  నిరంతరం శ్రమించారు.ఉమ్మడి  గా  ఉన్నపుడు ఆంధ్ర ప్రదేశ్  అన్ని రంగాల అభివృద్ధి లో ముందు అంజలో ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న రాష్ట్రాన్ని 2014 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అనైతికంగా, అప్రజాస్వామికంగా  రెండు ముక్కలుగా చీల్చింది . ఆంధ్ర రాష్ట్రానికి  అన్యాయం చేసింది. నాడు ఎన్నో హామీలను ఇచ్చింది. కానీ ఆ తర్వాత వచ్చిన బిజెపి ప్రభుత్వం కూడా ఎన్నో హామీ లను ఇచ్చింది మరియు విభజన చట్టంలో ఉన్న అన్ని హామీలను నెరవేరుస్తామని రాష్ట్రానికి తిరుపతి వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చింది.  ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీజేపీని ప్రభుత్వాన్ని నమ్మి తన సహాయ సహకారాలను అందించింది. రాను రాను కేంద్రం తన పక్షపాత వైఖరిని మరియు ఆంధ్ర లో చంద్రబబు నాయుడు గారు చేస్తున్నఅభివృద్ధి ని చూసి ఓర్వలేక తన పక్షపాత బుద్దిని చూపించడం ప్రారంభించింది . 



హామీల లో ప్రథమంగా ప్రజా రాజధాని అమరావతి నిర్మించడంలో తన సహాయ సహకారాలను ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి  అందిస్తానని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పారదర్శకతను, రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన అన్ని సదుపాయాలను కల్పిస్తానని, కడప ఉక్కు కర్మాగారాన్ని నిర్మిస్తానని, విశాఖ రైల్వే జోన్ ప్రారంభిస్తామని, ఇలా ఎన్నో చెప్పి చివరకు చెంబుడు నీళ్లు మరియు మట్టి ఇచ్చి చేతులు దులుపుకుంది. అక్కడితో ఆగకుండా రాష్ట్రం పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. అందుకు నిదర్శనంగా రాష్ట్రానికి ఇస్తానన్న ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం నిధులు ఆపివేసింది. రాష్ట్రం పై సీబీఐ సోదాలు ప్రేరేపిస్తూ, రాష్ట్ర ప్రజల  ఆశలను అణగతోక్కాలని చూస్తుంది. 


మన నాయకుడు  శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ఎన్నో విధాలుగా గత నాలుగేళ్లుగా కేంద్రం పై పోరాడుతున్నారు.  న్యాయం చేయకపోయిన మన రాష్ట్ర ప్రభుత్వమే కడప ఉక్కు కర్మాగార నిర్మాణానికి శంకుస్థాపన చేసారు.


నిన్నగాక మొన్న నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంలో, కాకినాడ, విజయనగరం , బిజెపి బూత్ వర్కర్స్,మరియు బిజెపి శ్రేణులతో వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడినప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతుందో నాకు తెలుసు, ఆంధ్ర ప్రజలు ఏమి కోరుకుంటున్నారో అది కూడా నాకు తెలుసు అన్నారు. అక్కడి ప్రభుత్వం ఏమీ చేయకుండా అన్ని చేసామని చెప్పి, పార్టీ సిద్ధాంతాలకు నీళ్లు వదిలి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి జనాన్ని మోసం చేస్తున్నారని చెప్పారు. మరి కింద వీడియో లో మీరు చెపింది ఏంటి ?



కానీ నిజాలు చుస్తే, బీజేపీ ఆంధ్ర ప్రజలను ఏ విధంగా మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్నారో పై వీడియో లో తెలుసుకున్నారు. కానీ నిజాలు నిప్పు లాంటివి వాటిని ఎవరు దాచ లేరు మరియు మార్చ లేరు.అసలు నిజాలు ఏంటో క్రింద వీడియో లో చూసి తెలుసుకోండి. 



పోలవరం ప్రాజెక్ట్:

డిసెంబర్ 15వ తేదీ వరకూఖర్చు పెట్టింది : రూ.10,069.66 కోట్లు కేంద్రం విడుదల చేసింది:  రూ.6,727.36 కోట్లు కేంద్రం 
ఇంకా చెల్లించాల్సింది:  రూ.3,342.40 కోట్లు (గత నాలుగు నెలలుగా ఒక్క రూపాయీ విడుదల చేయలేదు) 
చెల్లించాల్సిన డబ్బులు పై, వడ్డీ భారం రాష్ట్రానిదే రూ.57,940.86 కోట్లతో డీపీఆర్-2, 2017 ఆగస్టు 16న ఇస్తే, ఇప్పటి వరకు దాని పై స్పందన లేదు. నీతీ ఆయోగ్ వైస్ చైర్మన్ సూచన మేరకు, పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రం అప్పచెప్పింది.

రెవెన్యూ లోటు:


రాష్ట్ర విభజన జరిగిన తొలి ఏడాదిలో రెవెన్యూ లోటు భర్తీకి రూ.16,078.76 కోట్లుఇది మొదటి సంవత్సరంలోనే ఇవ్వాలికేంద్రం ఇప్పటి వరకు ఇచ్చింది రూ.3,979.50 కోట్లువిభజన చట్టంలో ఉన్న దీని గురించి చెప్పకుండా, అన్ని రాష్ట్రాలకు హక్కుగా  ఇచ్చే విషయం ప్రధాని చెప్తున్నారు.

ముఖ్యమంత్రి దావోస్ పర్యటన మీద కేంద్రం ఆంక్షలు విధింపు!!

 

  

7 రోజుల పర్యటన 4 రోజులకే కుదింపు ,15 మందికి బదులు ఐదుగురే వెళ్లాలని కేంద్రం స్పష్టీకరణ.అదే బ్యాంకులను నట్టేటముంచిన విజయ్ మాల్యా / నీరవ్ మోడీలను అయితే విదేశాలకు పొమ్మని స్వయంగా ఆర్ధికమంత్రి చెప్పటమో.. లేదా స్వయంగా ప్రధాని ఫ్లైట్ లో ఎక్కించుకొనో విదేశాలకు పంపిస్తారు.. వాళ్ళ మీద ఏం ఆంక్షలు ఉండవ్.. కానీ ఒక ముఖ్యమంత్రి రాష్ట్రం తద్వారా దేశంలో పెట్టుబడులకోసం వెళ్లే విదేశ పర్యటన విషయంలో ఆంక్షలు.

అరచేతితో ఆ సూర్యుడి వెలుగుని ఆపటం,ఆంక్షలతో ఈ చంద్రుడు లక్ష్యాన్ని ఆపడం అవివేకం అని గుర్తించక పోవడం బీజేపీ యొక్క పిచ్చితనం

Post a Comment

0 Comments