Facebook

Header Ads

బాబు వెంట నడిస్తే భవిష్యత్తే | vote for chandrababu naidu your future | be with chandrababu for your bright future





ఈ రోజుకు కూడా కాంగ్రెస్స్ అంటే కొంత అసహ్యం మిగిలే వుంది. అది వైఎస్ నుండి చాలా మంది చేసిన దుర్మార్గాలు  దోపిడీ కావొచ్చు, లేదా విభజనలో వారు మన ఆంధ్రా పట్ల అనుసరించిన అనుచిత విధానం కావొచ్చు.

కానీ ప్రస్తుత అధ్యక్షుడు రాహుల్ గాంధీ అంటే అభిమానమూ లేదు, అలాగని  అసహ్యమూ లేదు. బాబు గారు ఓడిపోయినప్పుడు, రాహుల్ గాంధీ తన పార్టీ వారికి అప్పట్లో చెప్పింది, మీడియాలో వచ్చింది, నాకు ఇంకా జ్ఞాపకం వుంది.
బ్యాలన్స్ గా వుండే మెచ్యూరిటీలో, రాహుల్ గాంధీ ముందు మోడీ గారు మరుగుజ్జులా కనిపిస్తారు.

ఆశగా లాటరీ కొని, జాక్‌పాట్ కొడితే ఉబ్బితబ్బిబ్బై, క్రమంగా అది మరిచి, ఆహంకారంతొ ప్రవర్తిస్తూ, మిగిలిన వారిని చులకనగా చూడ్డం, మోడీ ప్రవర్తన చూస్తే గుర్తుకొచ్చేది.

అధికారం అనుభవించడం కొత్తేమీ కాదు. ఇంట్లో నానమ్మ నుండి చూస్తూ పెరిగి, ఓటమి & గెలుపు రెండూ తెలిసిన మెచ్యూరిటీ రాహుల్ ది.


శ్రమ శక్తిని నమ్ముకొని, నిజాయితీగా కష్టపడి, దేశంలో & ప్రపంచంలో ఓ గుర్తింపు తెచ్చుకొన్న వ్యక్తిత్వంతో పివి నరసింహారావు లెక్కన, ఆచి తూచి ఆలోచనతో మెలిగే వ్యక్తిత్వం చంద్రబాబు.

గత ఎన్నికలకు ముందు బాబు చేయి లాగి లాగి పట్టి కూర్చోబెట్టి, ప్రక్కన కూర్చొన్నాడు మోడీ. కాంగ్రెస్స్ చేసిన తప్పులకు జాక్ పాట్ తగిలింది. గెలుపులో ఆ మెజారిటీ తన బలుపే అనుకొన్నాడు.

అమరావతికి శంఖూస్థాపనకు మోడీగారు వచ్చినప్పుడు, ఆయన ముందు బాబు గారు ఓ చేయి కట్టుకొని, మరో చేయితో అర్థించారు. మిగిలిన పొరుగు రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందే వరకు మా ఆంధ్రాకు చేయూత ఇవ్వండి అని. అది ఆయన అభిమానులకే కాదు ప్రజలు కళ్లల్లో కూడా ఇంకా మెదులుతూనే వుంది.



సిఎంగా వస్తానన్నా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, అదే సమయంలో ఎ2 గట్రాలకు ఇవ్వడం, అవమానించడం అన్నీ సహిస్తూ వచ్చాడు బాబు, మోడీ కంటే రాజకీయాలలో సీనియర్ అయినా.

రాష్ట్ర ప్రజలు, ఇతర పార్టీలు అందరూ ఇంకా ఏంది బిజెపి వారితో అని తిట్టే వరకు అర్థిస్తూ అటున్నాడు. అప్పుడు చెప్పి చూసాడు బిజెపికి. మధ్యలో వెంకయ్య మొహమాటం ఎందుకని కుట్రతో అత్యున్నత పదవికి పంపారు. దూరం అయ్యింది. అవమానాలు పెరిగే కొద్ది, సభలో దేశంలో ఏ పార్టీకి రాని తెగింపు వచ్చి, ఏకంగా ప్రధాని అని మరిచి మరీ హేళన చేసే పరిస్థితి తెచ్చుకోవడం మోడీ స్వయంకృతం.

అయినా బాబు ఒంటరిగా పడివుంటారు అని తక్కువ అంచనా వేసి, తెలంగాణాలో ఏకపక్ష తెగతెంపులు చేసుకొని, మరింత రెచ్చి పోయారు. కాలం ఎప్పుడూ ఒకేలా వుండదు. మోడీ పరివారానికి చంద్రబాబు రూపంలో ఓటమి సాక్షత్కరించింది.

ఎన్నో తర్కాల తరువాత అధికార మత్తు దిగి దీపావళి రాత్రినే వెంకయ్య ఇంటికి వెళ్లారు. కొన్ని సంఘ్ శక్తులు కూడా సంధి చేసుకోవడం మేలని సూచించాయి. దేశం అంతా తెలిసాక వెనుతిరగడం కుదరదనే సరికి మళ్లీ అధికారం వాడి, దాడుల భయం చూపాలని చూసారు.


తెలివైన వాడు ఎప్పుడూ అధికారాన్ని ఎప్పుడూ బూచిగా చూపెట్టి భయపెడతాడే గాని, ప్రయోగించడు. ఓ సారి ప్రయోగిస్తే, దెబ్బ తిన్న వ్యక్తులలో భయం పోయి మరింత రెచ్చిపోతారు.

మిత్రుడిని మానసికంగా వేధించి శత్రువుకు చేజేతులా జార్చుకొంటే, తెలివైన శత్రువులు గౌరవంగా చూసుకొంటే, మరింత మచ్యూరిటీతో, అది వారి పాలిట వరం అవుతుంది. అదే ఇప్పుడు జరుగుతోంది.

మితిమీరిన విశ్వాసం కేసీఆర్ ని, అహంకారం బిజెపిని మునిగేలా చేసింది.

మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణా లో ఫలితాలు దారుణంగా రాబోతున్నాయి. ఆ ఫలితాల తరువాత, చిన్నా చితకా పార్టీలలోనే కాదు, సొంత పార్టీలలో కూడా ఎదురుతిరిగే పరిణామాలు, అవమానాలు ఏ స్థాయిలో వుంటుందో, అది దేశం అంతా వ్యతిరేఖతను తీసుకొచ్చి, కాంగ్రెస్స్ కి ఓ ఊపును ఎలా తీసుకు రాబోతుందో, ఓ నెల ఆగితే అందరికీ తెలుస్తుంది.

Post a Comment

0 Comments