Facebook

Header Ads

ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనడం లో దేశం లోనే ఆంధ్ర ప్రదేశ్ నెం. 1 | ap is no 1 in facing natural disasters



మొన్న హుధుద్, నిన్న తితిలి ఆంధ్ర రాష్ట్రానికి చేసిన గాయాలు మర్చిపోక ముందే నేడు పెథాయి తూఫాన్ ముంచుకొచ్చింది. ఎప్పటిలాగే ఆంద్ర్ర ప్రదేశ్ ప్రభుత్వం మరియు ప్రభుత్వ యంత్రాంగం తూఫాను తీవ్రత  పై  కట్టుదిట్టమైన వ్యూహాలను అమలుచేసి ప్రాణ,ఆస్థి,పంట,నష్టాలను నివారించింది. 

తాజాగా వచ్చిన పెథాయి తూఫాను పై  మూడు రోజుల ముందు నుండే క్షేత్రస్థాయి లో హెచ్చరికలు చేస్తూ అందరిని అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి గారి సూచనతో, ఇప్పుడు అవలీల గా ఈ వైపరీత్యాన్ని ఎదుర్కోగలిగాం. ఇప్పుడు వచ్చిన తుపాను పరిధిలో 9 లక్షల కుటుంబాలున్నాయి. వాటిలో ఎక్కువ కుటుంబాలు తూర్పు  గోదావరి జిల్లాలోనే ఉన్నాయి. 




ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 283 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.. మిగతా  జిల్లాల్లో 203 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు

తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు-కాట్రేనికోన ప్రాంతాల్లో మద్యాహ్నం 12.15 గంటలకు తుపాను తీరాన్ని తాకింది. అనుక్షణం ఈ విపత్తుపైనే ముఖ్యమంత్రి దృష్టి పెట్టారు. బయట పర్యటన జరుపుతున్నా టెలిఫోన్లో అధికారులతో క్షేత్రస్థాయి లో ఆరా తీసి తగు సలహాలను మరియు ఆదేశాలను జారీ చేసారు .

అంతే కాకుండా దానికి కావలసిన SDRF, NDRF ఇలా మొత్తం గా 40 బృందాలు మొత్తం 840 మంది తో , విద్యుత్ స్తంభాలు-10,000, విద్యుత్ సిబ్బంది-2000, అగ్నిమాపక సిబ్బంది-572 మంది, జెనెరేటర్లు- 820, వాటర్ ట్యాంకర్లు-622, భారీ గా కొవ్వొత్తులు, బియ్యం, కిరోసిన్ సిద్ధం చేసారు. 


 సీఎం చంద్రబాబు గారు ఏక  కాలంలో 15 వేల మందితో టెలి కాన్ఫరెన్స్  లో ఉండి అందర్నీ అప్రమత్తం చేశారు


గత 24 గంటలుగా పునరావాస కేంద్రంలో బాధితులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. 6 వేల మందిని పునరావాస కేంద్రాలకు ముందుగానే  తరలించారు. రైతులకు పంట కాపాడుకొనేందుకు టార్పాలిన్ పట్టాలను అందించింది.ఎంతమంది పై ప్రభావం చూపినా,వారందరిని ఆదుకోడానికి కి పూర్తిస్థాయిలో ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 

గ్రామాల్లో పరిస్థితులను మంత్రి నారా లోకేష్ గారు అనుక్షణం పర్యవేక్షించి తగు వ్యూహాలతో  ప్రజలకు చేదోడుగా ఉండే చర్యలను చేపట్టారు.ఆహారం, నీరు, నిత్యావసర వస్తువులు, జెనెరేటర్లు వంటి కనీస అత్యవసర సదుపాయాలను ప్రతి చోట సిద్ధం చేయించారు. 


తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో 816 జెనరేటర్స్ మరియు 622 త్రాగునీటి ట్యాంకర్స్ 1978mts బియ్యం, 677mts చక్కెర, 1335mts పప్పు, పామాయిల్ రెడీ చేశాంమంత్రి లోకేష్ సిద్ధం చేయించారు.

రాజకీయ పార్టీ అంటే సేవ దృక్పథం  ఉండాలన్నది  మా పార్టీ విధానం.దానికి అనుగుణంగానే ఎప్పుడు ఇటువంటి విపత్తు జరిగిన మా బృందాలు ఆయా ప్రాంతాల్లో సిద్ధంగా ఉండి  సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ప్రభుత్వ యంత్రాంగంతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు , కార్యకర్తలు  కూడా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందిగా మా అధినాయకుని ఆదేశం మేరకు అందరు సహాయక చర్యలో చురుకుగా పలు పంచుకున్నారు. రియల్ టైం గవెర్నెన్స్ సొసైటీ, రాష్ట్ర విపత్తు నివారణ సంస్థ, ఆధ్వర్యంలో ఒక సమన్వయంతో తుపాను హెచ్చరికలు, సహాయక చర్యలు ఉధృతంగా చేపట్టారు.



















Post a Comment

0 Comments