Facebook

Header Ads

సమర్ధ నాయకత్వం ఉంటే.... సాయం కోసం వేచి ఉండడం దండగ



ఆంధ్ర ప్రదేశ్ భారత దేశం లోని 29 రాష్ట్రాలలో ఒకటి.తెలుగు ప్రధాన బాష.భారత దేశం లో ఎనిమిదవ అతి పెద్ద రాష్ట్రము ఆంధ్రప్రదేశ్.ఇక్కడ ప్రవహించే నదులు గోదావరి, కృష్ణా, తుంగభద్ర మరియు పెన్నా,1953 అక్టోబర్ 01 రాయసీమ దత్తత జిల్లాలను కలుపుకొని ఆంధ్ర రాష్ట్రము ఏర్పడింది. కాల క్రమంలో బాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు జరిగింది. హైదరాబాద్ రాష్ట్రము లో ఉన్న మరాఠీ, కన్నడ, బాషా మాట్లాడే వారు మహారాష్ట్ర, కర్ణాటక జిల్లాలో కలవగా మద్రాస్ నుండి వేరుపడ్డ ఆంధ్ర రాష్ట్రము, నిజం పాలిత ప్రాంతం అయినా హైద్రాబాద్ రాజధానిగా చేసుకొని 1956 నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏర్పడింది. తెలంగాణ కి ప్రత్యేక రాష్ట్రము కావాలని అడపా దడపా ఉద్యమాలు జరిగిన దాదాపు గా 58 సంవత్సరాలు  తెలుగు వారందరు కలిసే ఉన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం 2014 జూన్ 2 న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలుగావిడదీసింది. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి ఎన్నో హామీలను ఇచ్చింది. 

తర్వాత అధికారం లోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర కి మేము ఉన్నాం అని చెప్పింది. ప్రత్యేక హోదా , విశాఖ  రైల్వే జోన్ , కడప ఉక్కు కర్మాగారం , రాజధాని నిర్మాణానికి నిధులు ఇస్తాను అంది, పోలవరం కి నిధులు , రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లా లకు భుంథేల్ ఖండ్ తరహా ప్యాకేజ్ , పెట్రో కాంప్లెక్స్ , విశాఖ-చెన్నై కారిడార్ , దుగ్గి రాజపట్నం పోర్ట్ , ఇలాంటి ఎన్నో హామీలను చేసింది కేంద్రప్రభుత్వం. కానీ కేంద్రం ఎం చేసింది 

కానీ ఎం చేసింది కేంద్రం ఆంధ్రా  కి  ? వివరాల్లోకి వెళ్తే.... 

రాజధాని శంకుస్థాపన రోజున తెచ్చిన చెంబుడు మట్టి, చెంబుడు నీళ్లు తప్ప ఎం ఇచ్చింది. రాజధాని నిర్మాణం అంచనావ్యయం కేంద్రం ఇచ్చింది కేవలం 15 వేల కోట్లు పైగా ఇంకా మొదట్లో ఇస్తా అన్న ప్రత్యేక హోదా స్థానం లో ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తా అన్నారు.




Post a Comment

0 Comments