Facebook

Header Ads

సూర్యోదయ రాష్ట్రంలో.... సౌర ప్రకాశం

ఆంధ్రప్రదేశ్ లో పర్యావరణహిత సోలార్‌ విద్యుత్తు ఉత్పత్తిని పెంచుకోవాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా.రాష్ట్రంలో 24 వేల ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన 4 సౌర పార్కుల్లో 4 వేల మెగావాట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తికి ఒప్పందాలు కుదిరాయి.ఇందులో ఇప్పటికే 
అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, ఎన్ పీ కుంట ప్రాంతాలలో, కడప జిల్లాలోని జమ్మలమడుగులోను ఏర్పాటు చేసిన సోలార్ పార్కులతో 2,840 మెగావాట్ల సౌరవిద్యుత్తు అందుబాటులోకి వచ్చింది.

కాగా తాజాగా కర్నూలు జిల్లాలోని గని, శకునాల గ్రామాల పరిధిలో ఏర్పాటు చేసిన అల్ట్రా మెగా సోలార్‌ పార్కును ముఖ్యమంత్రి ప్రారంభించడంతో మరో వెయ్యివాట్ల సౌరవిద్యుత్తు అందుబాటులోకి వచ్చింది. 

చైనాలోని టెంగర్ సోలార్ పార్క్, రాజస్థాన్ లోని భాడ్ల సోలార్ పార్కు తర్వాత ప్రపంచంలోనే మూడో అతిపెద్ద సౌర విద్యుత్తు పార్కు మన కర్నూలులోనే ఏర్పాటుకావడం నవ్యాంధ్రకే గర్వకారణం. 5,683 ఎకరాల్లో రూ.7,143 కోట్లతో వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ అల్ట్రా మెగా సోలార్‌ పార్కుతో 282 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ సోలార్ పార్కులో 45,80,471 సోలార్ పీవీ మాడ్యుళ్ళను బిగించారంటే ఎంత పెద్ద ప్రాజెక్టో ఆలోచించండి. 



అనంతపూర్ సోలార్ పార్క్


కర్నూలు సోలార్ పార్క్ ప్రారంభంతో నవ్యాంధ్ర రెండోస్థానానికి ఎగబాకనుంది.


దేశంలో సౌరవిద్యుత్ ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలలో ఇప్పటివరకు కర్ణాటక, తెలంగాణాల తరువాత ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది.కర్నూలు సోలార్ పార్క్ ప్రారంభంతో నవ్యాంధ్ర రెండోస్థానానికి ఎగబాకనుంది. రాబోయే మూడేళ్లలో మరో 10 వేల మెగావాట్లను ఉత్పత్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. సూర్యోదయ రాష్ట్రంలో, చంద్రన్న పాలనలో అసాధ్యమన్నది ఉంటుందా చెప్పండి.

Post a Comment

0 Comments